‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ నిజజీవితంలో మాత్రం చాల మొహమాటస్తుడు. మైక్ దగ్గరకు వచ్చిన వెంటనే చాల సిగ్గుతో మాట్లాడటానికి పదాలు లేవు అన్నట్లుగా ప్రభాస్ వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే దీనికి భిన్నంగా ప్రభాస్ నిన్న జరిగిన ‘మహానుభావుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎదో చెప్పాలని ప్రయత్నిస్తూ చాల మొహమాటంతో చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం పై ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆ సక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

‘శర్వానంద్ మా ఇంటి హీరో తన ప్రవర్తన బాగుంటుంది. శర్వా కాబోయే సూపర్ స్టార్’ అంటూ ప్రభాస్ చేసిన కామెంట్స్ ను విన్న వారు వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ మహేష్ బిరుదును శర్వానంద్ కు ఎందుకు ట్రాన్స్ ఫర్ చేసాడు అంటూ చాలామంది తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదే ఫంక్షన్ లో ప్రభాస్ మాట్లాడుతూ ఈసినిమాలో శర్వానంద్ నటన చూసిన తరువాత తాను శర్వానంద్ అభిమానిగా మారిపోవడమే కాకుండా తనకు సొంత తమ్ముడులా శర్వా మారిపోయాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ప్రభాస్. 

తాను ప్రస్తుతం కారులో ఎక్కడకు వెళ్ళుతున్నా ‘మహానుభావుడు’ పాటలనే వింటున్నానని అంటూ ప్రభాస్ ఈమూవీ పై ప్రశంసలు కురిపిస్తూ అంచనాలు పెంచేసాడు. దీనితో సామాన్యంగా పొగడ్తలకు దూరంగా ఉండటమే కాకుండా ఎవర్ని పొగడని ప్రభాస్ శర్వానంద్ ను ఈవిధంగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు అంటూ మరికొందరు ఆ ఫంక్షన్ లో కామెంట్ చేసుకున్నట్లు టాక్. 

ఇదే ఫంక్షన్ లో హీరో శర్వానంద్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ తన జీవితంలో ‘మహానుభావుడు’ ప్రభాస్ మాత్రమే అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు తన చుట్టూ ఉన్నవాళ్ళు పైకి రావాలని కోరుకునే వ్యక్తి ప్రభాస్ అంటూ శర్వా ప్రభాస్ పై కురిపించిన పొగడ్తలతో ‘మహానుభావుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హోరెత్తి పోయింది. దీనితో వీరిద్దరి స్నేహం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: