‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ ఇంకా తన పార్టీని పూర్తిగా జనం మధ్యకు తీసుకు వెళ్ళలేకపోయినా పవన్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పవన్ అభిమానులను ఆనందంలో ముంచెత్తి వేస్తోంది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్స్ లెన్స్ అవార్డుకు పవన్ ఎంపిక చేసింది.

నవంబరు 17 న హౌస్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో ఈ పురస్కారాన్ని పవన్ కు అందచేయబోతున్నారు. ఇటీవలే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పవన్ ను గౌరవించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో సేవలు అందించినవారికి ఏటా గ్లోబల్ బిజినెస్ మీట్ సందర్భంగా ఈ అవార్డులను ఇచ్చి ఈ సంస్థ గౌరవిస్తోంది. 

నటుడిగా, రాజకీయ నాయకుడిగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న పవన్ కు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఐఈబీఎఫ్ ఇండియా విభాగం అధిపతి సునీల్ గుప్తా కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు వారు పవన్ ను కలిసి ఆహ్వానం కూడ అందించారు. 

అయితే ఈ అవార్డ్ వార్త వెలువడిన కొద్ది గంటలలోనే పవన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు కూడ వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చి పవన్ ఇప్పటి వరకూ సాధించింది ఏమిటి ? అంటూ కొందరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ ఎంత వరకు ప్రశ్నలు వేయగలిగాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

అదేవిధంగా పవన్ ఒక విషయం పై మాట్లాడుతూ ఆ విషయం పై తనకు పెద్దగా అవగాహన లేదు అంటూ కొంత కాలం ఆ తరువాత అదే సమస్య పై విమర్శలు చేయడం లాంటి టాలెంట్ కు పవన్ గుర్తించి ఇటువంటి అంతర్జాతీయ అవార్డులు ఇచ్చారా అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఏమైనా పూర్తి స్థాయి రాజకీయాలలోకి ఇంకా రాకపోయినా పవన్ కు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావడం పవన్ అభిమానులు అత్యంత ఆనంద పడే విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: