తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ తర్వాత ఎవడే సుబ్రమాణ్యం చిత్రంలో నాని స్నేహితుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.  తర్వాత ‘పెళ్లి చూపులు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన విజయ్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో స్టార్ హోదా సంపాదించాడు.  ఈ చిత్రంపై మొదట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి..కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
Image result for ram gopal varma facebook
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఉంది..అంతే కాదు మనోడి తీరు, ఆవేశం అచ్చం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మలాగే ఉంటోంద‌ని ప్రేక్ష‌కులు అంటోన్న విష‌యం తెలిసిందే.  విజయ్ స్పీడ్ చూసి రాంగోపాల్ వర్మ ఆశ్చర్యపోయిన నేను బతికి ఉండగానే నాలాంటి వ్యక్తి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడని కితాబు ఇచ్చాడు.  విజయ్ ని కొంద‌రు యంగ్ ఆర్జీవీ అంటున్నారు.
Image result for ram gopal varma facebook
అందుకు త‌గ్గ‌ట్లుగానే ఆయ‌న ఈ రోజు ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశాడు.  తాజాగా మనోడు ఆర్‌జీఆర్‌ (రామ్ గోపాల్ రెడ్డి) ను ప‌రిచ‌యం చేస్తున్నానంటూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోలా రామ్‌గోపాల్ వ‌ర్మ గ‌డ్డం మీసాల‌తో ఉన్నాడు. ‘రామ్ గోపాల్ రెడ్డికి హాయ్ చెప్పండి’ అంటూ విజ‌య్ దేవ‌రకొండ పేర్కొన్నాడు.  
Image result for vijay devarakonda
దీనిపై రక రకాల కామెంట్స్ వస్తున్నాయి.. 'నీకు మంచి ఫ్రెండ్ దొరికాడు' అని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డికి తండ్రి ఆర్‌జీఆర్' అని మ‌రొక‌రు పేర్కొన్నారు.  ట్విస్ట్ ఏంటంటే..ఈ ఫొటోను రామ్ గోపాల్ వర్మ కూడా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: