మళియాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మమ్ముట్టి అంటే అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. మళియాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి, మోహన్ లాల్ స్టార్ హీరోలు గా గుర్తింపు పొందారు. తాజాగా మమ్ముట్టిపై కొన్ని వ్యంగ్య కామెంట్లు ఫ్యాన్స్ కోపానికి గురైంది అప్ కమింగ్ మళియాళ బ్యూటీ అన్నా రాజన్.
రీసెంట్ గా ఈ అమ్మడు ఓ టివి చానలో లో స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ..మమ్ముట్టిపై కొన్ని చీఫ్ కామెంట్స్ చేసింది. దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయగా.. కన్నీటితో సారీ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియో సందేశాన్ని అందించింది. వివరాల్లోకి వెళితే.. మమ్మూటి, ఆయన తనయుడు సల్మాన్ దుల్కర్‌లలో అవకాశం వస్తే ఎవరికి జోడీగా నటిస్తారని ఓ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌ను యాంకర్ ప్రశ్నించింది.
దానికి సమాధానంగా దుల్కర్‌తో నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు వెటకారంగా మాట్లాడింది. దీంతో మమ్ముట్టి ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చి అన్నా రాజన్ నే కాదు ఆమె తండ్రిని సైతం వదలకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో తీవ్ర పోస్టులు పెట్టేశారు. దీంతో దిగొచ్చిన అన్నా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది.
ఈ సందర్భంగా అన్నా రాజన్ మాట్లాడుతూ..వాస్తవానికి ‘మమ్మూటీ సర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్లు చేయలేదు. దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ.. దుల్కర్‌కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు, మమ్మూటీతో కూడా జోడీగా నటించుకుంటున్నట్లు నేను చెప్పాను. ఈ అమ్మడు తాజా చిత్రం వెలిపండిట్ పుసక్తంలో మోహన్‌లాల్(57 ఏళ్లు) వైఫ్‌గా నటించి మెప్పించింది