అన్నయ్య చిరంజీవి పేరును నిలబెట్టేందుకు సోదరుడు పవణ్ కళ్యాణ్ ఆరాటపడుతున్నాడని తెలుస్థోంది. సినిమా రంగంలో చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ పేరును చిరస్థాయిగా ఉంచేందుకు పవర్ స్టార్ నిజంగా అలుపెరుగని వార్ చేస్థున్నాడట. రాజకీయాల్లోను చిరంజీవిని స్టార్ చేయాలని తెగ తాపత్రయ పడ్డ పవణ్ కు అనివార్యకారణాల వల్ల అది సాద్యం కాకపోవడంతో తనదైన సినిమారంగంలో అన్నయ్య కు తగ్గ తమ్ముడు అనిపించుకునేందుకు ఇప్పుడు విపరీతంగా శ్రమిస్థున్నాడని టాలీవుడ్ వర్గాలు, పవణ్ సన్నిహితులు అంటున్నారు.

ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలతో తాజాగా టాలీవుడ్ లో ఉన్న అగ్రతారలందరి సరసన పవణ్ కళ్యాణ్ ఉన్నాడు, కాస్థా ఎక్కువ క్రేజిగూడా సంపాదించుకున్నాడనడం కూడా అతిశయోక్థి కాదు. అందుకే ఇక తన అన్న సాధించిన అనితర ప్రగతిని అంటే సినిమా రంగంలో ఉన్న అన్ని కాటగిరీలలో కూడా తన ప్రతిభను చూపి అన్నకు తగిన తమ్మునిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో పవణ్ ఉన్నాడని అంటున్నారు.

త్వరలో తెరపైకి వస్థున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాతో పూర్థి స్థాయి కుటుంబకథా చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించి ఇంటిల్లిపాదితో శబాష్ అనిపించుకోనున్నాడట. దీని తర్వాత గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా తెరపైకి వస్థున్న మరోచిత్రం ద్వారా పక్కా మాస్  ఈ పవర్ స్టార్ అనిపించుకోనున్నాడని సమాచారం.

అలాగే దాని తర్వాత వస్థున్న ‘ బెంగాల్ టైగర్’ సినిమాతో అన్ని రకాల మాల్ మసాల చూపించి సినిమాల్లో వారెవ్వా... పవణ్  నిజంగా నీవు అన్నపేరు నిలబెట్టిన తమ్మునివి అంటూ అందరి చేత అన్నించుకోవడమే కాకుండా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో చిరంజీవి తర్వాత నేనే నిరూపించేందుకు సిద్దమయ్యాడు పవణ్ అంటున్నారు. సినిమాల్లో నెంబర్ వన్ స్థానం ఎప్పటికి  మా మెగా కుటుంబానిదే అంటూ మెగా ప్యామిలీ పవర్ ను చాటేందుకు అన్ని రకాల శక్తియుక్తులతో అలుపెరుగక కష్టపడుతున్న పవణ్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: