తెలుగు సినీప్రేక్షకుల గుండె జారి గల్లంతయి వందరోజులయింది, గల్లంతయిన గుండె ఎవరి మనసుల్లో దాక్కుందో అంటూ సినిమా వర్గాలు ఆరా తీస్థే దానిని వందరోజులుగా ‘నితిన్ – నిత్యామీనన్’ లపై తెలుగు ప్రేక్షకులు పారేసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడర్థమయిందా... అసలు విషయమేంటో.

విడుదలకు ముందు ఎలాంటి భారీ అంచనాలు లేకుండా తెలుగు వెండితెరపైకి వచ్చిన ‘గుండెజారి గల్లంతయిందే’ సినిమా విడుదలయై నేటికి వందరోజులు పూర్థి చేసుకుంది. ఊహించని రీతిలో హిట్టయి సినిమాలు లేక ఇబ్బందుల్లో ఉన్న నితిన్ కెరియర్ ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెల్లింది. ఈ హిట్టుతో హీరో నితిన్ కు మరిన్ని మంచి సినిమాల అవకాశం దక్కింది.

వందరోజులు పూర్థయిన సంధర్బంగా చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. అందరం ఎంతో కష్టపడి చేసిన చిత్రం ఎంతో చక్కని పలితాన్నిచ్చింది అని చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా అన్నారు. 18 కేంద్రాల్లో వందరోజులు పూర్థి చేసుకుందని, వందరోజుల వేడుకను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్థామని నిర్మాత నిఖితా రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: