నందమూరి హీరోలకు మన ఆంధ్రదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న విషయం  తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలోని మన తెలుగు వారిలో చాలా మంది బాలకృష్ణ జూనియర్ ఎన్టీర్ లకు వీరాభిమానులు ఉన్నారు. ఈ వీరభిమనంతో ఖరీదైన వారి కార్లకు తమ అభిమాన హీరోల పేర్లనే నెంబర్ ప్లేట్లగా పెట్టుకుని హడావిడి చేస్తున్నారు. అమెరికాలో వ్యక్తిగత పేర్ల పై కూడా నెంబర్ ప్లేట్స్ పెట్టుకునే అవకాసం ఉంది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అమెరికాలోని మన్ తెలుగు వారు వారి అభిమాన హీరోల వీరభిమాన్నాన్ని చాటుకుంటున్నారు. టాలీవుడ్ లో బాలయ్యకు యంగ్ టైగర్ కు మధ్య విభేదాలు పెరిగిపోయి వారిద్దరి మధ్య దూరం పెరిగిపోతున్నా మన అమెరికా ఆంధ్రులు మాత్రం విరిద్దరిని సమానంగానే ఆదరిస్తున్నారు. ఇదే పద్ధతి మన టాలీవుడ్ లో కూడా మన నందమూరి అభిమానులు ఆచరిస్తే ఎంత బాగుంటుందో.... 

మరింత సమాచారం తెలుసుకోండి: