నంద‌మూరి యంగ్ హీరో క‌ళ్యాణ్ రామ్ ఎంతో క‌ష్టప‌డి న‌టించి నిర్మించిన ఓం న‌ష్టాలు తెచ్చిపెట్టింది. దాదాపు 13కోట్ల లాస్ వ‌చ్చినట్టు స‌మాచారం. 25కోట్లతో రూపొందిన ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ కి 6 కోట్లే వ‌సూలు చేసింద‌ని, రిలీజ్ ముందే ధియేట‌ర్ల రైట్స్ అమ్మిన‌ప్పటికీ క‌ళ్యాణ్ రామ్ చాలా లాస్ అయ్యాడ‌ని కొద్దిమంది అంటున్నారు.

నిజానికి ఈ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ చాలా క‌ష్టప‌డ్డాడు. త‌న మార్కెట్ వాల్యూ ఎంతో తెలిసి కూడా ఫ‌స్ట్ యాక్షన్ త్రిడి ఫిల్మ్ తీసిన‌వాళ్లం అవుతామ‌ని హాలీవుడ్ నుండి టెక్నిషియన్స్ పిలిపించి మ‌రీ కోట్లు కుమ్మురించాడు. అంతేకాదు సినిమా కోసం గుండు కూడా కొట్టించుకున్నాడు. కానీ ద‌ర్శకుడి వైఫ‌ల్యం వ‌ల్లే సినిమా అట్టర్ ప్లాప్ అయింద‌ని, ఈ రేంజ్ లాస్ వ‌చ్చింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి ఈ దెబ్బకైనా నంద‌మూరి చిన్నోడుకి బుద్ది వచ్చిందో లేదో అని కొద్దిమంది గుస‌గుస‌లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: