మాస్ మహరాజ్ రవితేజ మాస్ సినిమాల రచ్చ గురించి అందరికి తెలిసిందే.. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరి మనసులను దోచేసిన రవితేజ కొద్దికాలంగా కెరియర్ లో సక్సెస్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. బెంగాల్ టైగర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో రాజా ది గ్రేట్ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా.


అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్లో శిరీష్ నిర్మాణంలో వస్తుంది. పటాస్, సుప్రీం సినిమాల హిట్ తో తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్న అనీల్ రావిపుడి అసలైన మాస్ రాజా రవితేజతో చేస్తున్న సినిమా రాజా ది గ్రేట్. సినిమాలో గుడ్డివాని పాత్రలో నటిస్తున్న రవితేజ టీజర్ తో అలరించాడు. 


ఇక కొద్దినిమిషాల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. లైఫ్ ఎదురొచ్చి ఇవ్వదు.. ఎదురెళ్లి తీసుకోవాలి అంటూ అమ్మ చెప్పిన ఓ మాటతో రాజా ది గ్రేట్ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్ గా రాజా ది వారియర్ అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు రవితేజ. తన సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేసిన రవితేజ కొద్దిపాటి గ్యాప్ తో వస్తున్న ఈ రాజా ది గ్రేట్ తో సత్తా చాటేలానే ఉన్నాడు.


మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ నెల 18న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రవితేజను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందని నమ్ముతున్నాడు. మరి సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: