పవణ్ కళ్యాణ్ హీరోగా వస్థున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాకు దూరం పెరిగిందన్న వార్థలు తాజాగా టాలీవుడ్ లో వినిపిస్థున్నాయి. పరిస్థితులు ఇప్పటికే అబ్బాయి సినిమా ‘ఎవడు’ ను ఎంతో దూరం నెట్టేసింది. కారణం ఏంటో దిల్ రాజు చెప్పకపోయినా అది అందరికి తెలిసిన రాష్ట్ర విభజన వివాదమే అన్నది అక్షరసత్యం.

ఇదే ప్రాబ్లమ్ ఇప్పుడు అత్తారింటికి దారిని ఇంకా దూరం చేస్థోందట. తెలంగాణ ఏర్పాటా... సమైక్యాంధ్రనా అన్న విషయంపై ఆగస్టు 5లోగా నిర్ణయం వెలుబడనుందని సమాచారం. అది విభజనే అన్న అనుమానంతో ఇప్పటికే సీమాంధ్రలో ఆందోళనలు మిన్నంటాయి. నిజానికి సినిమా వాళ్లకి కలెక్షన్లు కురిపించేది తెలంగాణ కంటే ఆంద్రప్రాంతమే అన్నది అందరికి తెలిసిందే.

నిర్ణయం ఆగస్టు 5లోపు వచ్చినా, రాకున్నా కూడా సీమాంద్రలో ఆందోలనలు ఉదృతమయ్యే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే సీమాంధ్ర జేఏసి తన ఆందోలన కార్యక్రమాల కార్యాచరణ ప్రకటించింది. ఇందులో బందులు రావడం సర్వసాధారణం. అందుకే ఆగస్టు 7న ‘అత్తారింటికి దారేది’ విడుదల చేస్థే అట్లర్లీ ప్లాప్ అవుతుందన్న భయం ఇప్పుడు నిర్మాతకు పట్టుకుంది. కేంద్రమంత్రిగా చిరంజీవికి అన్నీ తెలిసే నిర్మాతకు చెప్పి ‘ఎవడు’ సినిమాను వాయిదా వేయించాడన్నది అందరికి తెలిసిందే, ఇంత తెలిసాక పవణ్ సినిమాను కూడా విడుదల చేసే సాహసం ఎలా చేస్థారు, అందుకే అత్తారింటికి దారిని కూడా కాస్థా దూరం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఎన్నిరోజులు వాయిదా వేస్థారు, ఎప్పుడు రిలీజ్ చేస్థారు అన్నదానిపైనే సినిమా బృందం చర్చిస్థున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: