ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చింది అన్నట్టుగా తయారయింది పరిస్థితి. పడగవిప్పిన రాజకీయ స్వార్థం ఇప్పుడు రాజకీయాలకే కాదు సినిమావాళ్లకు చిచ్చుపెట్టింది. సీమాంధ్రలో రగిలిన ఆందోళన సినిమారంగాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్థోంది.

కోట్లాది రూపాయలు పెట్టి తీసిన భారీచిత్రాలు బయటకు రావడానికి భయపడుతున్నాయి. అప్పుసొప్పు చేసి చేసిన చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. సినిమాలు ఆడి నాలుగుపైసలు రావాలంటే ఏపిలో మేజర్ పార్ట్ సీమాంధ్ర. అలాంటి సీమాంధ్రలో చిచ్చుపుట్టింది. రాష్ట్ర విభజన అంశంతో సీమాంధ్ర మండిపోతోంది. ఇప్పుడు విధ్యార్థి నుంచి మంత్రుల వరకు, సాధారణ రైతు నుంచి బడా నాయకుని వరకు సమైక్యాంధ్ర అంటూ రోడ్డుపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు.

ఈ సమయంలో బ్లాక్ బస్టర్ సినిమా విడుదలయినా సరే అట్టర్లీ ప్లాప్ అవుతుందనన్నది సినిమా వాళ్ల అభిప్రాయం. అందుకే ఈనెల 31న రావాల్సిన రాంచరణ్ ‘ఎవడు’ సినిమా ఎక్కడికో పోయింది. ఆగస్టు 7న రావాల్సిన పవర్ స్టార్ సినిమా ‘అత్తారింటికి దారేది’ అడ్రస్ గల్లంతవుతుందన్న భయంలో పడింది. వీటితో అంతా పూర్థయి విడుదలకు సిద్దంగా ఉన్న అయిదారు చిన్న సినిమాలు ఈ రెండు విడుదలయి చల్లబడితే కాని బయటకు రాని పరిస్థితి. అందుకే ఇప్పుడు సినిమావాళ్లకు సీమాంధ్ర చిచ్చుపెట్టింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: