తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న హీరో కమల్ హాసన్.  గత కొంత కాలంగా హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో పెద్దగా విజయాలు సాధించకున్నా..పవన్ తో నటించిన ‘గబ్బర్ సింగ్’  సూపర్ హిట్ అయ్యింది.  అప్పటి నుంచి వరుస విజయాలతో తమిళ, తెలుగు, హిందీ భాషట్లో నటిస్తున్న ఈ అమ్మడికి గత కొంత కాలంగా సినిమాలు లేకుండా పోయాయి. 
Shruti Haasan's tweet about Kannada films upsets Jaggesh
తాజాగా శృతి హాసన్ ని ఓ కన్నడ హీరో ఘోరంగా అవమానించాడు.  శ్రుతి హాసన్ అసలు అందంగా ఉండదని , మేకప్ తీసేస్తే ఆమెని చూసి జడుసుకోవడం ఖాయమని అంత చండాలంగా ఉంటుందని ఆమెని మించిన అందగత్తెలు కర్ణాటకలో చాలామంది ఉన్నారని అలాంటి వారికి చాన్స్ లు ఇవ్వకుండా శృతి లాంటి గర్విష్టి వెంట దర్శక, నిర్మాతలు పడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Image result for kannada hero jaggesh
అయితే మనోడు ఇంతగా వీరంగం చేయడానికి గల కారణం ఏంటా అనుకుంటున్నారా..! ఈ మద్య  కన్నడ సినిమాలో శ్రుతి హాసన్ ని హీరోయిన్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు..కానీ శృతి హాసన్ మాత్రం నేను ఏ కన్నడ సినిమాలో కూడా నటించడం లేదు అంటూ ట్వీట్ చేయడంలో వారు అవమానంగా ఫీల్ అయ్యారట. 
Image result for shruthi hassan
శ్రుతి హాసన్ ట్వీట్ తో రగిలిపోయిన జగ్గేష్ శ్రుతి ని మించిన అందగత్తె లు కర్ణాటక లో చాలామంది ఉన్నారని .....అసలు శ్రుతి ని మేకప్ లేకుండా చూడలేమని ఘోరంగా అవమానించాడు జగ్గేష్. 



మరింత సమాచారం తెలుసుకోండి: