తొలి సినిమా ఏ మాయ చేసావె తో స్టార్ హిరోయిన్ అయిపొయింది సమంత. ఆనతి కాలం లోనే కోటి రూపాయల కధానాయికగా వెలిగింది. సిద్దూ తో ప్రేమాయణం తో వారల్లోకి ఎక్కింది. సిద్దూ వల్లే కొన్ని సినిమాలు వదులుకుంది అని టాక్. అంతే కాదు... ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాలకు దూరం కావాలని భావిస్తోందట.

సిద్దు కి తెలుగులో అంతగా కలసి రాలేదు. పైగా తెలుగు మీడియా పై, ఇక్కడి ప్రేక్షకులపై ఏదేదో వాగి తెలుగువారి ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఎలాగు సిద్డుకి తెలుగు సినిమాలు రావు. అందుకే సమంత ని కూడా తెలుగు పరిశ్రమకు దూరం చేయాలనుకుంటున్నాడు.

క్రమంగా తెలుగు సినిమాలు త‌గ్గించి త‌మిళంలోనే సెటిల్ అవ్వాల‌ని చూస్తోంది సమంత ప్రస్తుతం సూర్యతో ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఆ సినిమా విజయం సాధిస్తే ఇక అక్కడే ఉండిపోవాలనే నిర్ణయం తీసుకుందట. ఆ చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకొంది స‌మంత. అది విజ‌యం సాధిస్తే మాత్రం ఇక పూర్తి స్థాయిలో త‌మిళంలోనే సెటిల్ అవుతుంద‌ట‌. ఈ యేడాది చివ‌రికొచ్చేస‌రికి ఎక్కువ‌గా తమిళ సినిమాలే నా చేతుల్లో ఉంటాయ‌ని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: