ఇండస్ట్రీలో కొంత మందికి అదృష్టం ఏ రకంగా కలిసి వస్తుందో ఎవరూ చెప్పలేరు..ఇప్పుడు అలాంటి అదృష్టం ‘బిగ్ బాస్’ లో చివరి వరకు పోటీగా నిలిచిన హరితేజకు దక్కిందని అంటున్నారు.  బిగ్‌బాస్ రియాలిటీ షో ముగిసిన తర్వాత హరితేజ కెరీర్‌ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోతున్నది.  గతంలో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన హరితేజ ఇప్పడు టెలివిజన్, సినిమా రంగాల్లో హాట్ సెలబ్రిటీగా మారింది. ఒకప్పుడు ఆఫర్ల కోసం పడిగాపులు కాసిన హరితేజకు బిగ్ బాస్ పుణ్యమా అని బిజీ బిజీగా మారనుందట. ఆమెలో ఉన్న ఎనర్జీ, ప్రతిభ ఏంటో బిగ్‌బాస్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు, సినీ వర్గాలకు ఏకకాలంలో తెలిసొచ్చింది.   అలాంటి హరితేజకు సినిమాలతో పాటు పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించే అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ముఖ్యంగా హరితేజ ప్రతిభాపాటవాలకు, క్రేజ్‌కు మెచ్చి ఆమెకు ఓ కీలకమైన రియాలిటీ షో బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తున్నది.  అయితే హరితేజ మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది లేదు. రెండున్నర నెలలు కుటుంబంకు దూరంగా ఉన్నందున ఫ్యామిలీకే టైం కేటాయిస్తున్నారు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం మల్లెమాల ఎంటర్ టైన్మెంట్ నుంచి హరితేజను ఒక షోకు యాంకర్‌గా  తీసుకుంటున్నా రని, మల్లెమాలకు ఉన్న పేరు, బ్రాండ్‌ నేపథ్యంలో వెంటనే హరితేజ ఓకే చెప్పిందని తెలుస్తోంది. మల్లెమాల అనే పేరు వినిపించగానే అంతా ఠక్కున జబర్దస్త్‌ మరి ఈ జబర్ధస్త్ లో ఎవరి ఎసరు వస్తుందా అని అనుకుంటే..అది ఖచ్చితంగా రష్మికే అని చెప్పొచ్చు. 

మొదటి నుంచి జబర్దస్ద కి యాంకర్ గా ఉంటున్న అనసూయ పలు షోల్లో బిజీగా మారగానే జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో రష్మి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నా..తెలుగు మాత్రం స్పష్టంగా మాట్లడలేక కొత్తలో ఇబ్బంది పడింది. అనసూయ మళ్లీ జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం..అదే సమయంలో రష్మీకి హీరోయిన్ గా పలు సినిమాల్లో చాన్స్ రావడం జరిగింది.  ప్రస్తుతం జబర్దస్త్‌ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లకు ప్రస్తుతం రష్మీ మరియు అనసూయలు యాంకర్స్‌గా ఉన్నారు. 
రష్మీ తప్పించారో లేదా
కాకపోతే రష్మీ కూడా అంత తీసిపారేసే విధంగా ఏమీలేదు. ఆమెకు ఇటీవల సినిమా ఆఫర్లు బోలెడు వస్తున్నాయి. అయినా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను వదల్లేక అలాగే యాంకరింగ్ చేస్తూ పోతోంది. ఇక రాబోయే రోజుల్లో సినిమాల్లో చేసేందుకే రష్మి మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హరితేజకు తన ఎనర్జితో జబర్దస్త్‌ను మరింత జబర్దస్త్‌గా నడిపించగల సత్తా ఉందని, అందుకే ఆమెను యాంకర్‌గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పాటలు చాలా తేలికగా పాడుతూ, మంచి సమయస్ఫూర్తితో ఆకట్టుకొనే హరితేజను తీసుకోవడం జరిగిందనే మాట వినిపిస్తున్నది.
Image result for reshmi anasuya
మరోవైపు బిగ్‌బాస్2లో ఆమె పేరు పరిశీలనలో ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నదనేది మరో రూమర్. ఒకవేళ బిగ్‌బాస్ ఆఫర్ నిజమైనట్లయితే ఆ రియాలిటీ షోకు మరింత గ్లామర్ వచ్చే అవకాశం ఉంది.  ఒకవేళ జబర్దస్త్‌‌ షోకు హోస్ట్‌గా చేయడం వల్ల హరితేజ మరింత క్రేజ్‌ను సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: