హీరో రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో చేయవలసిన సినిమా ఆఖరి నిముషంలో ఆగిపోవడానికి చరణ్ భార్య ఉపాసన కారణం అంటూ ఒక విచిత్రమైన కధనం లేటెస్ట్ గా టాలీవుడ్ లో ప్రచారానికి వచ్చింది. ఉపాసనకు చరణ్ ను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా లవర్ బాయ్ లా చూడాలని ఉందట. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘ఎవడు’, ‘జంజీర్’ రెండు సినిమాలు కూడా హై వోల్టేజి రివెంజ్ డ్రామాలు కావడంతో అతరువాత వచ్చే సినిమా అదే పంధాలో ఉండకుండా వెరైటీ లవ్ స్తోరిగా ఉంటే బాగుటుందని ఉపాసన చెప్పడంతో కొరటాల శివ సినిమాకు బ్రేక్ ఇచ్చాడని అంటున్నారు.

 ఈ మధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చరణ్ తన భార్య గురించి మాట్లాడుతూ ఆమె బాలీవుడ్ లో వచ్చే యాష్ రాజ్ సంస్థ నిర్మించే ప్రేమ కధా సినిమాలను ఇష్టపడుతుందనీ తనని కూడా అటువంటి సినిమాలను చేయమని చెపుతోందని అన్నాడు. అందువల్ల తన భవిష్యత్ సినిమాలలో కొద్దిగా వెరైటీ పాత్రలు చేద్దామని అనుకుంటున్నానని, చెప్పడమే కాకుండా తన మాస్ ఇమేజ్ తో పాటు క్లాస్ ఇమేజ్ ను పొందడానికి తాను ప్రయత్నిస్తున్నానని చెర్రీ అన్నాడు. ఈ కారణాలు వల్ల చెర్రీ ద్రుష్టి కొత్త కధలపై పడటమే కాకుండా త్రివిక్రమ్ లాంటి దర్శకుల సినిమాలలో నటించాలనే కోరిక వైపు చెర్రీ మనసును మళ్ళించింది అంటున్నారు.

కానీ లవర్ బాయ్ గా రామ్ చరణ్ ‘ఆరేంజ్’ సినిమాలో కనిపించి ఘోరంగా విఫలం అయిన విషయం ఉపాసన మరిచి పోయింద అనే మాటలు వినిపిస్తున్నాయి. కర్ణుడు చావుకు వంద కారణాలు ఉన్నట్లు బండ్ల గణేష్, కొరటాల శివల సినిమా ఆగి పోవడానికి ఉపాసన కూడా కారణం అయితే అయి ఉండవచ్చు....

 

మరింత సమాచారం తెలుసుకోండి: