దంగల్ సినిమా లో  ఆమిర్ ఖాన్ కూతురు పాత్ర చేసిన జైరా వసీం అందరినీ తన నటన తో ఆకట్టుకుంది, అద్భుత రూపం - సౌందర్య వతి అయిన ఆమె ఆమిర్ ఖాన్ కూతురు గా అతని ఖ్యాతిని పెంచుతూ సినిమాలో దేశానికి గోల్డ్ మెడల్ తీసుకుని వస్తుంది. ఇండియా తో పాటు చైనా లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమెకి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఈ మద్య సెలబ్రెటీలు ఏం మాట్లాడినా అవి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  అంతే కాదు సెలబ్రెటీలు ఏదైనా తేడాగా మాట్లాడితే ఆ విషయం సంచలనానికి దారి తీస్తోంది. ఆ మధ్య జైరా వసీం తన ఇంస్టా గ్రామ్  లో హాట్ ఫోటోలు పెట్టి విమర్శలకు గురైన  జైరా ఇప్పుడు తాను దంగల్ సినిమా తప్ప మరే సినిమాలూ చూడలేదు అంటూ బాంబు పేల్చింది.

తాజాగా తాను ఆమిర్ తో కలిసి నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా గురించి ప్రమోషన్ లలో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. తాను ఎప్పుడూ నటిని అవుతానని అనుకోలేదని చెప్పింది. అసలు, తనకు సినిమాలు చూడటమంటేనే ఇష్టముండదని తెలిపింది.

సినిమా చూసేందుకు ఒకవేళ థియేటర్ కు వెళ్లినా.. సినిమా పూర్తయ్యే వరకు ఉండలేనని చెప్పింది జైరా, స్టార్ డం తనని వెంటాడుతూ ఉన్నా సాధారణ జీవితం గడపడానికే తాను ఇష్టపడతాను అని ఆమె అంటోంది. ఆమె వ్యాఖ్యల మీద కొందరు సోషల్ మీడియా లో ట్రాల్ చెయ్యడం మొదలు పెట్టారు. ఆమె దంగల్ తప్ప మరే సినిమా చూడలేదు అంటే మేము నమ్మాలా అంటూ గేలి చేస్తున్నారు కొందరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: