ప్రియురాలిపై ఎంత ఇష్టం వుంటే ప్రియుడు ఇచ్చే గిప్ట్ ఆ రేంజ్ లో వుంటుంది అంటుంటారు. అయితే పెళ్లైక కూడా ప్రేయ‌సిపై అదే ప్రేమ వుండ‌టం అరుదుగా జ‌రుగుతుంటుంది. గ‌తంలో షాజ‌హాన్ త‌న భార్య నూర్ జాన్ కోసం తాజ్ మ‌హ‌ల్ క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇపుడు షాజ‌హాన్ కి ఏమాత్రం తీసిపోన‌ని హాలీవుడ్ యాక్షన్ హీరో బ్రాడ్ ఫిట్ ప్రూవ్ చేస్తున్నాడు.

జ‌న‌ర‌ల్ గా త‌న భార్య ఏంజెలీనా జోలి ఎవ్రీ బ‌ర్త్ డేకు ఓ స‌ర్ ప్రైజింగ్ గిప్ట్ ఇచ్చే ఈ గ్రేట్ ల‌వ‌ర్ క‌మ్ హ‌జ్బెండ్ ఈసారి ఏకంగా విమానాన్ని గిప్ట్ గా ఇస్తున్నాడు. అయితే ఈ గిప్ట్ ఇవ్వడానికి ఓ కార‌ణం వుందిలెండి. అదేంటంటే ఏంజెలినా జోలికి విమానాలు న‌డ‌ప‌డం వ‌చ్చాడ‌ట‌. అంతేకాదు ఓ విమానాన్ని కొనేసి ప్రపంచాన్ని చుట్టేసి రావాల‌ని ఆమె చిర‌కాల కోరిక‌ట‌. ఆ కార‌ణంగానే త‌న భార్య కోరిక తీర్చేందుకు బ్రాడ్ ఫిట్ విమానాన్ని గిప్ట్ గా ఇస్తున్నాడ‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: