టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల‌తో పాటు లైవ్ క్యారెక్ట‌ర్ల‌ను బేస్ చేసుకుని సినిమాలు వ‌చ్చే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ బ‌యోపిక్ బేస్ చేసుకుని ఏకంగా రెండు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఒక‌టి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌గా తెర‌కెక్కిస్తుంటే మ‌రోవైపు ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌య్య - ద‌ర్శ‌కుడు తేజ కాంబోలో మ‌రో బ‌యోపిక్ వ‌స్తోంది.

balakrishnudu movie కోసం చిత్ర ఫలితం

ఈ బ‌యోపిక్‌ల సంగ‌తి ఇలా ఉంటే ఇప్పుడు ఏపీలో ఓ మ‌హిళా మంత్రి క్యారెక్ట‌ర్‌తో మ‌రో సినిమా రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ లేడీ మంత్రి ఎవ‌రో కాదు ప‌రిటాల సునీత‌. ప‌రిటాల సునీత దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర భార్య అన్న‌ది తెలిసిందే. గ‌తంలో ర‌వి జీవిత చ‌రిత్ర‌పై వ‌ర్మ ర‌క్త‌చ‌రిత్ర పేరుతో 1,2 భాగాలు తెర‌కెక్కించాడు. ఇప్పుడు ర‌వి స‌తీమ‌ణి సునీత క్యారెక్ట‌ర్‌లో వ‌చ్చే సినిమా బ‌యోపిక్ కాదు.


ప‌రిటాల ర‌వి జీవిత క‌థను స్ఫూర్తిగా తీసుకుని రాసిన ఓ క‌ల్పిత క‌థ అని టాక్‌. నారా రోహిత్ హీరోగా `బాల‌కృష్ణుడు` అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా స్టోరీ రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌. ఇది దాదాపు ప‌రిటాల ర‌వి క‌థ‌నే పోలి ఉంటుంద‌ట‌. ర‌వి కిడ్నాప్ ఆ టైంలో ఆయ‌న భార్య సునీత ఏం చేశారు ?  ఆమె ఎలాంటి పోరాటాలు చేశారు ?  అన్న లైన్‌తో బాల‌కృష్ణుడు సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

balakrishnudu movie కోసం చిత్ర ఫలితం

ఇక ఈ సినిమాలో ప‌రిటాల ర‌విని కిడ్నాప్ చేసే క్యారెక్ట‌ర్‌లో నారా రోహిత్ న‌టిస్తుంటే ర‌వి భార్య సునీత క్యారెక్ట‌ర్ మ‌న శివ‌గామి ర‌మ్య‌కృష్ణ చేస్తున్నార‌ట‌. ఏదేమైనా టాలీవుడ్‌లో మ‌రో ఇంట్ర‌స్టింగ్ క‌థాంశంతో బాల‌కృష్ణుడు సినిమా రెడీ అవుతోంది. మ‌రి మ‌న శివ‌గామి ఈ క్యారెక్ట‌ర్‌లో ఎలా విజృంభిస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: