ఈ మద్య కామెడీ, హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.  ఇప్పటికే లారెన్స్ తెరకెక్కించిన ఈ టైప్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ వస్తున్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  తెలుగు లో ఇప్పటి వరకు కామెడీ,థ్రిల్, హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాలు దాదాపు మంచి విజయం సాధించినవే. రీసెంట్ తెలుగు లో వచ్చిన ఆనందోబ్రహ్మ చిత్రం మంచి విజయం సాధించింది..వాస్తవానికి ఇందులో ఏ హీరో కూడా లేడు. కేవలం మంచి సబ్జెక్ట్ కి కామెడీ జోడించారు.
Image result for raju gari gadhi 2 posters
తాజాగా బుల్లితెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించిన యాంకర్ ఓంకార్ ఇప్పటికే ‘రాజుగారి గది’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు.  తాజాగా అక్కినేని నాగార్జున, అక్కినేని సమంత ప్రాధాన పాత్రలుగా ‘రాజుగారి గది 2’ తెరకెక్కించారు.  ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కాగా అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ వచ్చింది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది-2 సినిమా  నాగార్జున, సమంత చుట్టూనే తిరుగుతుంది.
Image result for raju gari gadhi 2 posters
మరీముఖ్యంగా ఈ సినిమాలో కీలకమైన క్లైమాక్స్ ఘట్టానికి సమంత మార్పుచేర్పులు చెప్పిందని స్వయంగా నాగార్జున ప్రకటించారు.  తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు నాగార్జున. రాజుగారి గది-2 సినిమాకు అఖిల్ పాత్ర కూడా ఉందట..అంటే సినిమాలో కాదండోయ్..బయట.  ఈ సినిమాలో కొన్ని చోట్ల నాగార్జున ఓ పొడుగాటి కోట్ తో కనిపించాడు. నాగార్జునపై తీసిన సాంగ్ తో పాటు.. ఓ కేసును ఛేదించే సన్నివేశాల్లో ఈ కోట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కోట్ ను నాగార్జున కోసం కొరియా నుంచి ప్రత్యేకంగా తెప్పించాడట అఖిల్.

అంతే కాదు నాగ్ వాడిన షూస్ కూడా అఖిల్ ప్రత్యేకంగా తెప్పించాడట. ఇవన్నీ తన పుట్టిన రోజుకు అఖిల్ గిఫ్ట్ గా ఇచ్చాడని తెలిపాడు.  అంతే కాదు తన పుట్టిన రోజు కి ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన నా మతి పోగొట్టాడు అఖిల్ అన్నారు.  ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటా అనుకుంటున్నారా..55ఏళ్ల వయసున్న ఓ చెట్టును కూడా తన పుట్టినరోజు కానుకగా అందించాడని, రాత్రికి రాత్రి ఆ చెట్టును తన ఇంట్లో నాటించాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: