దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బ‌స‌వ‌తార‌కం క్యారెక్ట‌ర్‌కు హీరోయిన్ దొరికేసింది. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ హీరోగా - తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాకు అన్ని సెట‌ప్ చేసుకుంటున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ అక్టోబ‌ర్ 20 నుంచి ప్రారంభంకానుంది. దీంతో సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లే ముందే కాస్టింగ్‌, ఇత‌ర టెక్నీషియ‌న్ల‌ను నియ‌మించుకునే ప‌నిలో తేజ బిజీగా ఉన్నాడు.

anupama parameswaran కోసం చిత్ర ఫలితం

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ రోల్‌కు బాల‌కృష్ణ మాత్ర‌మే ఎంపిక‌య్యాడు. ఇక సాంకేతిక నిపుణుల్లో ఒక్క కీర‌వాణి పేరు మాత్ర‌మే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వినిపిస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ద‌ర్శ‌కుడు తేజ ఓ వైపు స్క్రిఫ్ట్ వ‌ర్క్ కంప్లీట్ చేసుకుంటూనే మ‌రో వైపు న‌టీన‌టుల అన్వేష‌ణ చేస్తున్నారు. తాజాగా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటిక‌ల్ డ్రామాతో హిట్ కొట్టిన తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి.


ఇక లేటెస్ట్ టాక్ ఏంటంటే ఈ బ‌యోపిక్‌లో కీల‌క‌మైన ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తారకం రోల్ కోసం ఓ యంగ్ హీరోయిన్‌ను తేజ సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. ఆ యంగ్ హీరోయిన్ ఎవ‌రో కాదు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ప్రేమ‌మ్ - అ...ఆ - శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌న న‌ట‌న‌తో బాగా ద‌గ్గ‌రైన అనుప‌మ ప్ర‌స్తుతం రామ్‌తో ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ, నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలు చేస్తోంది. 

balayya-teja ntr biopic కోసం చిత్ర ఫలితం

అనుప‌మ‌కు అందంతో పాటు అదిరిపోయే అభిన‌యం కూడా ఉంది. దీంతో ఆమె న‌ట‌న‌కు మ‌న ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ కీల‌క‌మైన బ‌స‌వ‌తార‌కం రోల్‌కు తేజ ఆమెను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఆమె నిర్ణ‌యం రెండు మూడు రోజుల్లో వెల్ల‌డి కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు తేజ చెప్పాడు. 

ntr-basavatarakam కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: