బాలీవుడ్ లో విద్యాబాలన్ హవాయే వేరు. బడా హీరోలకు పోటీగా స్టార్ డమ్ సొంతం చేసుకుంది విద్య. నిన్నటి వరకు రకరకాల ప్రయోగాలు చేసిన విద్య.. ఇప్పుడు ట్రాక్ మార్చింది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఆడియన్స్ కి అయింట్మెంట్ ను పూయబోతోంది. తుమ్హారి సులు అంటూ రేడియో జాకీగా, గృహిణిగా కూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది.

Image result for vidya balan

బాలీవుడ్ లో హాట్ లుక్ లో కిక్ ఇవ్వలన్నా ... చీర కట్టుతో కనికట్టు చేయలన్నా అది ఒక్క విద్యాబాలన్ కే సాధ్యం. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో ఒకదానితో మరో సినిమాకి పోలిక లేకుండా సూపర్ ఫాస్ట్ గా మూవీస్ చేసేస్తోందీ బాలీవుడ్ భామ.

Image result for vidya balan tumhari sulu

కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి విద్యాబాలన్ కి బ్యాడ్ టైం వేధిస్తోంది. మొన్న కహాని 2 అంటూ పాత లాజిక్ తో వచ్చే సరికి జనం నో అనేశారు. నిన్న బేగమ్ జాన్ అంటూ చరిత్రని తవ్వితే రిజల్ట్ రివర్స్ అయింది. అందుకే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలి పై ఫోకస్ పెట్టింది.

Image result for vidya balan kahaani 2

విద్యాబాలన్ లేటెస్ట్ ఫిలిం తుమ్హారీ సులు రిలీజ్ కి రెడీ అయ్యింది. ముంబయిలో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెంది మామూలు ఇల్లాలు సులోచనగా బోల్డ్ విద్యా బాలన్ సూపర్ పర్ఫార్మెన్స్ తో అలరించనుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ మూవీ సోల్ ను రివీల్ చేసేసింది. అనుకోని పరిస్థితుల్లో రేడియో జాకీగా మారి.. సూపర్ ఫేమస్ అయిపోయి... ఆ పాపులారిటీతో సులోచన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడిందనేది స్టోరీ.

Image result for vidya balan kahaani 2

మేకప్ హంగామా లేకుండా సింపుల్ చీరకట్టుతో... మెడలో ఓ నార్మల్ చైన్ తో ఈ సినిమాలోని విద్యాబాలన్ లుక్ సూపర్ అంటున్నారు మూవీ లవర్స్. కామిడీ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామాగా సాగే తుమ్హారీ సులులో విద్యా అప్పియరెన్స్ హైలెట్ గా నిలవనుంది. ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: