కోలీవుడ్ హీరోనే అయినా చియాన్ విక్రం అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి గురి ఉంది. అపరిచితుడు సినిమా ఇక్కడ స్టార్ హీరోల సినిమాల్లానే ఆడిన సంగతి తెలిసిందే. హీరోగా ఎప్పుడూ ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అనేలా ఉన్న విక్రం ఈమధ్య హిట్ సినిమాలకు దూరమయ్యాడు. అందుకే ఈసారి పక్కా హిట్ కు పర్ఫెక్ట్ స్కెచ్ వేసి స్కెచ్ సినిమాతో రాబోతున్నాడు.


విజయ్ చందర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విక్రం మాత్రం మాస్ లుక్స్ తో అదరగొడుతుండగా తమన్నా కూడా క్యూట్ లుక్స్ లో కేకపెట్టిస్తుంది. విక్రం మార్క్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ స్కెచ్ టీజర్ చూసి విక్రం ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.


విక్రంను ఎలా చూడాలనుకుంటున్నారో అలా అతన్ని చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగుతుండగా చియాన్ విక్రంకు దుమ్మురేపే హిట్ ఇస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి భారీ రేంజ్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గడ్డం లుక్ లో విక్రం అదరగొడుతున్నాడని చెప్పాలి. 


థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మూవింగ్ ఫ్రేం ప్రొడక్షన్ లో రామ చంద్రన్ నిర్మిస్తున్నారు. ఎన్నాళ్ల నుండో హిట్ కోసం తపిస్తున్న విక్రంకు ఈ స్కెచ్ మూవీ ఈ స్టార్ కు ఊహించిన ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: