పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న అనిరుధ్ ఇప్పుడు ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూ లో ఈ సినిమా కహానీలతో పాటు అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ అంటే తనకి చాలా ఇష్టం అనీ అసలు తెలుగు సినిమాలో తనకి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది ఆయన వల్లనే అని అన్నాడు అనిరుధ్.

ఆయన తనకి గత సంవత్సరమే అ ఆ సినిమా టైం లో కాల్ చేసి తెలుగు వారికి నా మ్యూజిక్ నచ్చి తీరుతుంది అనే చెప్పారు. అయితే అ ఆ సినిమాకి నేనే మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంది కానీ ఇతర కమిట్మెంట్ ల వలన ఆ ఛాన్స్ తప్పిపోయింది.

కొత్త భాష కి సంబంధించి ఒక కొత్త సినిమాకి మ్యూజిక్ ఇచ్చే టైం లో చాలా అంశాలు పరిగణ లోకి తీసుకోవాలి అలాంటి పరిస్థితి లో నా సొంత ట్రూప్ లో మనిషి లాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు సహాయం చేసారు. అందుకే నాకు తెలుగు కి సంబంధించినంత వరకూ ఆయన గురువు, అందుకే గురూజీ అని పిలుస్తా.

పెద్దన్నయ్య లాగా మ్యూజిక్ నుంచి అనేక విషయాలలో అంటే తెలుగు సాహిత్యం నాకు అంతగా రాదు కాబట్టి అలాంటి విషయాల్లో ప్రతీ మాట నీ నాకు ఇంగ్లీష్ లో అవసరమైతే తమిళం లో వివరించారు ఆయన. 


మరింత సమాచారం తెలుసుకోండి: