ఈ మద్య టాలీవుడ్ లో యంగ్ హీరోలు నాని, రాజ్ తరుణ్, శర్వానంద్, నిఖిల్ వరుస విజయాలు సాధిస్తూ తమ సత్తా చాటుతున్నారు.  ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఈ హీరోలు తమ టాలెంట్ నమ్ముకొని మంచి కథలు ఎంచుకుంటూ విజయాలు సాధిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకుంటున్నారు. తాజాగా ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తాజగా ‘రాజుగాడు’ చిత్రంలో నటిస్తున్నాడు. 
Image result for రాజ్ తరుణ్
హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమా  కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మావ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్.  ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని వచ్చిన రాజ్ తరుణ్ అనూహ్యంగా హీరోగా మారాడు.   దీపావళి పండుగ సందర్భంగా రాజ్ తరుణ్ నటిస్తున్న ‘రాజుగాడి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Image result for raj tarun raju gadu\
 ఈ పోస్టర్ లో అమైరా దస్తుర్‌ను కౌగిలించుకున్న రాజ్‌త‌రుణ్ మెల్లిగా ఆమె బ్యాగులోని సెల్‌ఫోన్ కొట్టేస్తున్న‌ట్లు ఈ లుక్ చూస్తుంటే మనోడు మరో చిలిపి క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాకు సంజనారెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: