పవన్ కళ్యాణ్ లాంటి మాస్ , క్లాస్ హీరోతో సినిమా చెయ్యాలని ఏ డైరెక్టర్ కి మాత్రం ఉండదు ? స్టార్ హీరోతో సినిమా అంటే అందరికీ ఒక సౌలభ్యం ఉంటుంది. ఆ హీరో ని కొత్తగా చూపిస్తే తమ మార్కెట్ రేంజ్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏ హీరో దృష్టిలో పెట్టుకుని ఏ డైరెక్టర్ కథ రాస్తున్నాడు అనేది చెప్పలేని పరిస్థితి.

ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ గా చేసుకుని కథ రాస్తున్నాడు అని తెలుస్తోంది. గ‌మ్యం, వేదం, కృష్ణంవందే జ‌గద్గురుమ్‌, గౌత‌మిపుత్ర‌…. ఇలా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ఓమార్క్ సృష్టించుకొన్నాడు క్రిష్‌. ఇప్పుడు బాలీవుడ్‌లో మ‌ణిక‌ర్ణిక రూపొందిస్తున్నాడు. 

ఆ తరవాత తెలుగులో ఒక సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు దాని కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాడు క్రిష్.గతం లో  ప‌వ‌న్ కోసం ఓ క‌థ రాసుకొనే ప‌నిలో ఉన్నాడ‌ని టాక్‌. కంచె కంటే ముందు… ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి శ‌త‌విధాల ప్ర‌య‌త్నించాడు క్రిష్‌.కానీ అది కార్య‌రూపం దాల్చలేదు.

ఈ సారి మాత్రం ప‌వ‌న్‌ని త‌న క‌థ‌తో మెప్పించాల్సిందేన‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడ‌ట‌. గౌతమీ పుత్ర శాతకర్ణి రిజల్ట్ తో తను పెద్ద హీరోలని సైతం హ్యాండిల్ చెయ్యగలను అని నిరూపించుకున్నాడు ఈ డైరెక్టర్ సో పవన్ ఇతనికి ఛాన్స్ ఇవ్వచ్చు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: