బాహుబలి సినిమాలో ప్రభాస్ నటన ఎంతగా ఆకట్టుకుందో, అంతకు అంతగా దేవసేన సౌంధర్యం కూడా. ఆ సినిమాకు అన్నీ హంగులు ఉన్నా అనుష్క అందం, రాకుమారిగానే కాకుండా ప్రజల మద్యలో సాధారణ యువతిగా ఆమె నటన  అత్యంత ఆకర్షనీయం అంతకుమించి తన కుమారుని మహారాజ పట్టాభిషేకం వరకు ఆమె నటన సినిమాకు హైలైటే. అంతవరకు భల్లాలుని రాక్షస చర్యలను భరిస్తూ కనపరచిన హృదయవిధారక నటనే కాదు, తన కుమారుడు ఏనాటికైనా తిరిగి వచ్చి తనను రాజ్యాన్ని రక్షించగడన్న నమ్మకం ఆ విశ్వాసం నటనలో ప్రకటించిన తీరు అనితరసాధ్యం. దీన్ని బట్టి స్టార్ బ్యూటీ అనుష్క నటన ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.



ఏ పాత్రలోనైన నటించి మెప్పించే నటి అనుష్క. ఆమె చిత్రసీమకొచ్చి పదేళ్ల పైనే అయినా ఇంకా తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అలాగే కొన్ని పాత్రల్లో మరచిపోలేని నటననూ ప్రదర్శించింది. బాహుబలితో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఇప్పుడు మరో చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాలో అనుష్క కోసం అయిదు కోట్లు ఖర్చుపెడుతున్నారు. 


ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమెకున్న భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఇతర కథానాయకికి లేదంటే ఆశ్చర్యం లేదు. మూడు పదుల వయసు దాటినా కూడా అందం లో ఏ కొంచం పదును తగ్గలేదు ఈ బ్యూటీ రాజసం మాత్రమే కాదు, ఆ నయగారం, ఆ వయ్యారం ఎవరూ మరచిపోలేరు. అయితే బాహుబలి తర్వాత ఇంత వరకు ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. 


Image result for bhagmati telugu movie



ప్రస్తుతం "భాగమతి" అనే ఒకే ఒక్క సినిమా చేస్తోంది. దర్శకుడు జి.అశోక్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా రూపొందిస్తు న్నాడు. షూటింగ్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది.   ప్రస్తుతం దర్శకుడు గ్రాఫిక్స్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే ఖర్చు బాగా ఎక్కువైందట. అయితే ఈ సినిమాలో అనుష్క శరీరాకృతిని గ్రాఫిక్స్‌తో అందంగా తీర్చిదిద్దారట. ఇందుకోసం నిర్మాతలు భారీగా ఖర్చుచేశారని సమాచారం. జనతా గారెజ్ ఫేం మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ జోడీగా నటించాడు.  ఇక సినిమాకు సంబంధించిన ఒక్క లుక్‌ ను కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్ ఆఫ్ ఫిల్మ్‌. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: