ఈ మద్య విశ్వనటుడు కమల్ హాసన్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు.  ఇప్పటికే బిగ్ బాస్ కి సంబంధించి ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వూ ఇచ్చిన కమల్ హాసన్ మహాభారతం గురించి చెడుగా మాట్లాడారని, హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలోని ఉప్పరపేట పోలీస్ స్టేషన్ లో ప్రణవానంద స్వామిజీ కేసు పెట్టారు. మహాభారతం, ద్రౌపదిపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు కష్టాలు తెచ్చాయి. వల్లియూర్‌ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. 

గత కొంత కాలంగా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటున్న కమల్ హాసన్ తాజాగా మరో వివాదంలో తల దూర్చారని వార్తలు వస్తున్నాయి.  ఓ ఔషధంపై విమర్శలు చేసిన కలకలం సృష్టించిన విలక్షణ నటుడు కమల్ హాసన్‌పై కేసు నమోదైంది. డెంగీ, ఇతర వైరల్ వ్యాధులకు వాడే నిలవెంబు కుడినీర్ అనే స్థానిక మందును వాడొద్దని, దాని వల్ల సంతాన సామర్థ్యం తగ్గుతుందని కమల్ తన అభిమానులకు చెప్పాడు.
Image result for kamal haasan big boss
దీనిపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ... క‌మ‌ల‌హాస‌న్‌ శాస్త్రవేత్త కాదని ఎద్దేవా చేశారు. నీలవెంబు వైద్యం గురించి మాట్లాడే హక్కు ఆయ‌న‌కు లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఆయన వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో అనిశ్చితి, గందరగోళం నెలకొనే  అవకాశముందని జి.దేవరాజన్ అనే వ్యక్తి చెన్నై పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కమల్‌పై కేసు పెట్టారు. తమిళ రాజకీయ నేతలతోపాటు, కేంద్రంలోని మోదీ సర్కాను తరచూ విమర్శిస్తుండడం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: