ఈ మద్య మహిళలపై కొంత మంది కాలాంతకులు జరుపుతున్న మారణకాండ గురించి రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.  సామాన్య మహిళలపైనే కాదు సెలబ్రెటీలపై కూడా లైంగి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన వర్ధమాన గాయని గుర్తుతెలియని వ్యక్తుల చేతులో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫోక్ ఆల్బమ్ సాంగ్స్‌తో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న గాయని హర్షితా దహియా (22)ను ఢిల్లీ శివార్లలో దారుణంగా కాల్చి చంపిన విషయం సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలా దగ్గరగా కాల్పులు జరిపి ఆమె తల, గొంతులో ఆరు బుల్లెట్లను దించడంతో అక్కడికక్కడే మరణించింది.
Image result for harshita dahiya
కాగా, తన తల్లి హత్య కేసులో బావే నిందితుడని హర్షిత కేసు పెట్టారు. అంతేకాకుండా తన బావ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె మరో కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో హర్షిత దారుణంగా హత్యకు గురైంది. హర్షితను తన భర్త దినేష్ చంపాడంటూ హర్షిత దహియా సోదరి లత బుధవారంనాడు సంచలన ప్రకటన చేసింది. తన తల్లి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయినందునే హర్షితను దినేష్ చంపినట్టు లత ఆరోపించింది.

ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. తాజాగా హర్యాణా సింగర్ హర్షితా దహియా హత్య కేసు మిస్టరీ వీడింది. హర్షిత బావే.. ఆమెను హత్య చేసినట్లు తేలింది. పోలీసుల విచారణలో దినేష్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతణ్ని శుక్రవారం (అక్టోబర్ 20) కస్టడీకి తరలించారు. ఇంటరాగేషన్‌లో అతడు నిజం అంగీకరించినట్లు, దీంతో నిందితుణ్ని 4 రోజుల పోలీస్‌ కస్టడీకి తరలించినట్లు పానిపట్‌ డిప్యూటీ ఎస్పీ దేశ్‌ రాజ్‌ తెలిపారు.  

Image result for harshita dahiya


మరింత సమాచారం తెలుసుకోండి: