వామ్మో.. సమంత తెరపైనే నవరసాలు ఒలకబోస్థుంది అనుకున్నవారికి నిజజీవితంలో ఆమె అంతకంటే ఘాటు అని రోజుకో విషయం తెలుస్థోంది. తాను బాగా చిలిపినని, సినిమా కోసం కాళేజి వయసులో గోడదూకుతూ కూడా పట్టుబడ్డానిని చెప్పింది. ఇప్పుడు ఇదే కాదు, నచ్చని పని చేస్థే కోపం  కూడా నషాలానికి ఎక్కుతుందట సమంతకు.

ఇప్పుడు అదే జరిగింది, పైగా తప్పుడు అర్థం వచ్చేవిదంగా పని చేసింది తనే, దానిని ఎత్తి చూపినందుకు ఆన్ లైన్ మీడియాపై కోపం వచ్చింది. అంతే వారిని సంబోదించి కోపం వెల్లగక్కింది, ఇలా చేస్థే బాగుండదని హెచ్చరించింది. ఆమెకు నటుడు సిద్దార్థకు మద్య ఏదో ఉందని టాలీవుడ్ కోడై కూస్థున్న విషయం తెలిసిందే.

అయితే తెలుగు, తమిళ సినిమాలకు కలిపి ఒకేసారి ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్న సమంత 21 ఏళ్ల కిందట ఉన్న రేవతి రికార్డును బద్దలు చేసింది. దీనికి అభినందనలు తెలుపుతూ సిద్దార్థ్ ట్వీట్ చేసాడు, దానికి ఆనందపడ్డ సమంతకూడా సిద్దార్థ్ థాంక్స్ అంటూ ట్వీట్ చేసింది. అయితే చివరలో మీకు నాహగ్స్ అండ్ కిసెస్ అని కూడా పేర్కొనే సరికి అప్పటికే వారిద్దరి మద్య సంబందంపై వదంతులు వస్థున్న నేపథ్యంలో ఇలా పేర్కొంటే ఎవరైనా ఏమనుకుంటారు... అదే ఆన్ లైన్ మీడియా అనుకుంది... కాని అది తప్పని తాను ఎవరికి ట్వీట్ చేసినా చివర్లో అలాగే పేర్కొంటానని ఇకపై ఇలా లేనిపోనివి వెబ్ సైట్లలో పేర్కొంటే బాగుండదని కోపంతో ఊగిపోయింది సమంత.

 

మరింత సమాచారం తెలుసుకోండి: