సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు.  కొంత మంది హీరోలు బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోలుగా మారారు.  అయితే ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరో మాస్ మహరాజ రవితేజ.   అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు వేస్తూ..పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’ చిత్రంతో మంచి సక్సెస్ సాధించాడు. 
Image result for raja the great stills
ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుస విజయం సాధించడంతో  టాప్ హీరోల లీస్ట్ లో చేరిపోయాడు.  తాజాగా రవితేజ నటించిన  'రాజా ది గ్రేట్' రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  కలెక్షన్ల పరంగా కూడా నాట్ బ్యాడ్ అనిపించుకుంది.  ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ కూడా నటించాడు.  రవితేజ చిన్ననాటి పాత్రలో మహధన్ కనిపించాడు.
Image result for raja the great stills
ఈ రాజా ది గ్రేట్ హిట్ కావడంతో సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది..ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ..తన కుమారుడు మహాధన్ ఇప్పుడు తన వద్దే ఫోజులు కొడుతున్నాడని.. సినిమాలో చిన్నప్పటి రవితేజగా నటించిన మహాధన్ నటనకు ప్రశంసలు దక్కుతుండగా, ఆ పుత్రోత్సాహం రవితేజలో స్పష్టంగా కనిపిస్తోంది.
Image result for raja the great stills
తన కుమారుడి నటనను మెచ్చుకుంటూ పలువురు ఫోన్ కాల్స్ చేస్తుంటే వాడు పొంగిపోతున్నాడని అన్నాడు. వాడి సెల్ ఫోన్ కు ఎన్నో మెసేజ్ లు వస్తున్నాయని చెప్పాడు. గత నాలుగు రోజులుగా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రవితేజ నటించిన  'రాజా ది గ్రేట్' మంచి సక్సెస్ కావడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని అన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: