మారుతి సినిమా కదా...? ఏ సర్టిఫికేట్ కామనే. అయితే ఈ సినిమాలో 70 చోట్ల సెన్సార్ కట్స్ చెప్పిందట. కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం చెప్పిందట. వాటిని తొలగించారు. చాల చోట్ల బ్లర్, బీప్ లకు పని కల్పించారు. దీనిని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో వుందో ఊహించుకోండి.
ఓ సెన్సార్ సభ్యుడు ఈ సినిమా బస్ స్టాప్ సినిమాకి బాబులా వుంది అన్నాడట. అది ఇంకా పరాకాష్ట. మొత్తం మీద మారుతి బూతు తప్ప మరో సినిమా తీయలేడు అనే సంగతి ఈ సినిమా మరో సారి రుజువు చేయనుంది.