ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి చిన్న వార్త తెగ హల్ చల్ చేస్తున్నాయి..ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా సెన్సేషన్ వార్తలు వెంటనే వైరల్ అవుతున్నాయి.  కొన్ని సార్లు ఇలాంటి వార్తలు సెలబ్రెటీలకు పాజిటీవ్ గా ఉన్నా కొన్ని మాత్రం చిక్కుల్లో పడేస్తున్నాయి. తాజాగా సోగ్గాడే చిన్నినాయన, భలే భలే మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన లావణ్య త్రిపాఠి కి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  ఇంతకీ ఆ వార్త ఏంటా అనుకుంటున్నారా..! తెలుగులో విజయవంతమైన '100% లవ్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Image result for lavanya tripathi hot
అయితే, ఈ సినిమా చేస్తానని చెప్పిన లావణ్య త్రిపాఠి, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె స్థానంలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ శాలిని పాండే నటిస్తోంది.  అయితే లావణ్య సడెన్ గా తప్పుకోవడంతో ఆ నిర్మాతకు ఆర్థకంగా ఎంతో ఇబ్బంది కలిగిందట..దీంతో రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని తమకు ఇప్పించాలని నిర్మాతలు అక్కడి కౌన్సిల్ ను కోరినట్టు, ఆ మేరకు ఆమెపై జరిమానా విధించినట్టు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
Related image
ఈ వార్తలపై స్పందించిన లావణ్య కోలీవుడ్ నిర్మాతల సంఘం తనపై రూ. 3 కోట్ల జరిమానా విధించినట్టు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆమె తెలిపింది. అయితే సినిమా నుంచి తప్పుకోవడం అనేది తన పర్సనల్ విషయమని..కెరీర్ పరంగా కొన్ని నిర్ణయాలు అలా తీసుకోవాల్సి వస్తుందని..అంత మాత్రాన నష్టపరిహారం వేశారని ఎలా పుకార్లు వచ్చాయో అని ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటుంది  డెహ్రాడూన్ బ్యూటీ .


మరింత సమాచారం తెలుసుకోండి: