కన్నడతో పాటు తెలుగు సినీరంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)’ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన ఉపేంద్ర తన పాత్రల విషయంలో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. 

కన్నడంలోనే కాకుండా తెలుగు సినీ అభిమానులకు కూడా బాగా చేరువైన కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రకటిస్తూనే ఉన్నారు.  బెంగళూరులోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర పార్టీ ప్రకటన చేశారు. డ్రెస్‌కోడ్‌ను ఖాకీ యూనిఫాంగా నిర్ణయించినట్లు చెప్పారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి డబ్బు అవసరం లేదని, కేవలం కొత్త ఆలోచనలు, ప్రజల కోసం కష్టపడే తత్వం ఉంటే చాలని ఉపేంద్ర అన్నారు. 
Image result for upendar new party
ఈ పార్టీ ప్రజా సేవకోసమే ఏర్పాటు చేశామని..పార్టీ సిద్దాంతాలు కట్టుబడి ఉంటుందని అన్నారు. మాజంలో మార్పును తీసుకురావడమే తన కల అని చెప్పారు. రైతుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. రాజకీయరంగంలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని... దాన్ని అంతం చేయడానికి శాయశక్తులా పోరాటం చేస్తామని చెప్పారు.
Image result for upendar new party
ఈ కార్యక్రమానికి ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా హాజరయ్యారు. ఉపేంద్ర అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అందరూ ఖాకీ షర్టులను ధరించారు.  చివరిగా  నేను ఎంజీఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ కాలేను. నేను ఉపేంద్ర లాగే ఉంటాను’ అని ఉపేంద్ర ఉద్వేగంగా మాట్లాడారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: