తెలంగాణ ప్రజల సుధీర్గ స్వప్నం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారం అవడంతో తెలంగాణ సెగ కోస్తా ఆంధ్రాకు తగిలింది. విభజన నిర్ణయం పై వ్యతిరేకంగా కోస్తా ఆంధ్రా ప్రజలు తమ ఉధ్యమాన్ని ఉదృతం చేసి సమైఖ్య ఆంధ్రప్రదేశ్ నిలపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్యమ వేడికి మొట్టమొదటిగా టార్గెట్ అవుతున్నది మెగా పొలిటికల్ హీరో చిరంజీవి. మెగా హీరోగా కోస్తా ఆంధ్ర ప్రజల గుండెలలో దైవంగా అభిమానాన్ని సంపాదించుకున్న చిరంజీవిని ప్రస్తుతం ఆయనను మెగా ఫ్లాప్ పొలిటికల్ హీరోగా చూస్తున్నారు.

సమైఖ్య వాదాన్ని మొదటినుంచి వినిపిస్తూ రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి తన మాటలకు  కట్టుబడ లేకపోయదని కేంద్రప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా సీమాంధ్ర ప్రజల ఘాడమైన కోర్కెను సోనియాగాంధీ ముందు వివరించడంలో ఘోరంగా విఫలమయ్యాడనీ కోస్తా ఆంధ్రాకు చెందిన NGO ఉద్యోగ సంఘాల నాయకులు చిరంజీవి పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా ఆ మంత్రి పదవిని పట్టుకుని వేళ్ళాడుతూ తనను మేగాహీరోగా భుజానికి ఎక్కించుకుని మోసిన కోస్తా ఆంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసాడని కోస్తా ఆంధ్రాకు చెందిన JAC నాయకులు చిరూపై నిప్పులు చెరుగుతూ మెగా కుటుంబ హీరోలు నటించిన సినిమాలు ఎవీ కూడా కోస్తా ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకుండా బ్యాన్ చేయాలనీ లేకుంటే ఆదియేటర్లలో ఆ సినిమాలు ఆడనివ్వము అంటూ పిలుపునిచ్చారు.

ఈ పిలుపు ఎంత సీరియస్ గా అమలు జరుగుతుంది అనే విషయం ప్రస్తుతం చెప్పలేకపోయినా అతి త్వరలో విడుదల కానున్న పవన్, రామ్ చరణ్ ల ‘అత్తారింటికి దారేది’. ‘ఎవడు’ సినిమాల పై ప్రభావం ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. పొలిటికల్ ఇమేజ్ రీత్యా చూసుకున్నా చిరంజీవికి తెలంగాణ కంటే ఆంధ్రలోనే ఇమేజ్ ఎక్కువ ఈ పరిస్థుతులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రారంభమైన సమైక్యాంధ్ర ఉద్యమంలో చిరంజీవి ఎటువంటి పాత్ర నిర్వర్తిస్తాడో చూడాలి.... 

మరింత సమాచారం తెలుసుకోండి: