కొద్ది గంటల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా గురించిన వార్తలు ప్రకటించిన వెంటనే ఇటు సినిమా ప్రేమికులలో అటు అభిమానులలో తలెత్తిన ప్రశ్న అత్తారింటికి దారేది చిత్రం వాయిదా పడనుందా ?

ఇప్పటికే ఇదే అంశం మూలాన అబ్బాయి చిత్రం ఎవడు ఆగస్ట్ మూడవ వారానికి వాయిదా పడగా ఇప్పుడు తాజాగా బాబాయ్ చిత్రం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం వాయిదా పడట్లేదు ఈ చిత్రాన్ని యధావిదిగా ఆగస్ట్ 7వ తేదీనే విడుదల చెయ్యనున్నారు .

పవన్ అభిమానులు మరియు సినిమా  ప్రేమికుల లో  నెలకొన్న అంచనాలకు ఈ చిత్రం వాయిదా పడితే అభిమానుల్లో నిరాశ నెలకొనే అవకాశం ఉన్నందున నిర్మాతలు ప్రకటించిన తేదీలోనే విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది .త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత మరియు ప్రనీతలు కథానాయికలుగా నటించారు . 

బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ అందించిన సంగీతం ఇప్పటికే ప్రజాదరణ పొందింది . మరి రాష్ట్రం ఉన్న ప్రస్తుత  పరిస్థితులలో ఈ చిత్రాన్ని పవన్ స్టామినా మాత్రమే కాపాడగలదు మరి ఈ చిత్రం  అభిమానుల అంచనాలను ఎంతవరకు చేరుకోగలదో  రాష్ట్ర విభజన గొడవలను ఎంతవరకు తట్టుకోగలదో వేచి చూడాల్సిన అంశాలు

మరింత సమాచారం తెలుసుకోండి: