టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రిటీష్ బ్యూటీ సోఫీ చౌదరి తో రొమాన్స్ చేస్తూ తన భార్య నమ్రత ఎదురుగానే లండన్ లో హడావిడి చేయబోతున్నాడు. మహేష్ తాను నటిస్తున్న ‘1’ సినిమాలో సోఫీ తో ఆడిపాడటానికి రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ సినిమాకు ఈ బ్రిటీష్ భామ కొత్త అయినా బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికే ఈ బేబి ‘షాదీ నంబర్’, ‘స్పీడ్’ సినిమాలలో నటించి బాగా పాపులర్ అయింది.

లండన్ లోని ఒక ప్రముఖ స్టుడియోలో వీరిద్దరు పై ఈ ప్రత్యేక పాటను ఆగస్టు 5వ తారీఖు నుండి చిత్రీకరిస్తారట.దేవీశ్రీప్రసాద్ ఈ పాటను మంచి హుషారు కలిగించే ట్యూన్ తో కంపోజ్ చేసాడని టాక్. ఈ సినిమాకు సంబందించిన మరొక టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9 న ప్రిన్స్ అభిమానులకు కానుకగా విడుదల చేస్తారని అంటున్నారు. మరి వీరిద్దరి నమ్రత ఏమంటుందో చూడాలి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: