చాలాకాలం తరువాత ‘సాహసం’ సినిమా ద్వారా హిట్ సంపాదించుకున్న తాప్సీ ఆనందం పై అంజలి నీళ్ళు చల్లింది. తన పిన్నితో గొడవలు వచ్చిన తరువాత ఇక తమిళ సినిమాలు చేయను అని చెప్పిన అంజలి అనుకోకుండా యూటర్న్ తీసుకుని లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ‘గంగ’ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర సంపాదించుకుని తాప్సీ షాక్ ఇచ్చింది. 'ముని', 'కాంచన'లకు కొనసాగింపుగా రాఘవ లారెన్స్‌ 'గంగ' పేరిట సినిమా తెరకెక్కిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలో కీలకపాత్రకు ఎంపికైన తాప్సీ అంజలి రాకతో తన పాత్ర ప్రాధాన్యం తగ్గిస్తారేమోనని ఆందోళనలో ఉందట. ఈ విషయమై కోలీవుడ్ మీడియా లో రకరకాల కధలు వస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు లారెన్స్ మొదటి తాప్సీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వాడని,అంజలి రాకతో తాప్సీని  పట్టించుకోవటం మానేసాడని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. తాప్సీ పరిస్ధితి మొదటి నుంచి విచిత్రంగానేఉంటోoది. ప్లాప్ హీరోయిన్ గా ముద్రపడ్డా ఆఫర్స్ కు లోటు లేకుండా దూసుకుపోయేది. అయితే ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయి. ‘సాహసం’ సక్సెస్ తాప్సీ కు వరస ఆఫర్స్ ఇవ్వలేకపోయింది దీనికి కారణం ఆ సినిమాలో ఆమెది గ్లామర్ రోల్ కాకపోవటం మైనస్ గా మారిందని అంటున్నారు.

పెద్ద సంస్ధలనుంచి ఆఫర్స్ వస్తాయనుకున్న నేపధ్యంలో ఇలా లారెన్స్ చిత్రంలో సైతం తనకు ట్విస్టు పడి ఇప్పుడు తనకు అంజలి రూపంలో సమస్య ఎదురైంది  అంటూ గగ్గోలు పెడుతోందట. కానీ లారెన్స్ మాత్రం ఈ ఇద్దరి భామలను సరిసమానంగా చూసుకుంటున్నాను అని అంటున్నాడట...
 

మరింత సమాచారం తెలుసుకోండి: