పరాజయాలు వస్తున్నప్పుడు  ఏ నటుడైనా తాను నటించబోయే తదుపరి చిత్రం గురించి చాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. పరాజయం ఎంత గొప్ప నటుడినైనా వణికించి వేస్తుంది కానీ విజయం పొందిన తరువాత కూడా రవితేజాను భయం వదలడం లేదు . గతంలో రవితేజాకు ఎదురై  వరుస ఫ్లాపులతో నిలువెల్లా వణికిపోయాడు. దాదాపుగా కెరీర్‌ ఎండ్‌ అయిపోయిందనే పరిస్థితికి చేరుకున్న రవితేజ ‘బలుపు’  విజయంతో కోలుకున్నాడు.  ఇంతకుముందు తన దగ్గరకు నిర్మాత వస్తే చాలు దర్శకుడు ఎవరు, కథ ఏంటి అనేవి రవితేజ అస్సలు పట్టించుకునేవాడు కాదు.

నిర్మాత అడ్వాన్స్‌ ఇస్తే చాలు అనుకుంటూ వరుసగా సినిమాలు చేసేవాడు.  కానీ రవితేజ తన సినిమాల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్ల వల్ల వరుసగా ఫ్లాపులు రావడంతో ఒక అయిదేళ్ల ముందే రవితేజ కెరీర్‌ ఆగి పోతుందా అనిపించే స్థాయికి అతడి సినిమాలు అనుమానాన్ని రేకెత్తించాయి. కానీ ‘బలుపు’ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరించిన మన మాస్ మహారాజాకి అతడు కోరుకున్న విజయం దక్కింది. సినిమా విడుదల అయిపోయిన వెంటనే ఆ చిత్ర జయాపజయాలతో సంబందం లేకుండా మరో సినిమా చేసే రవితేజా ప్రస్తుతం చాల కామ్ గా ఉంటూ తన తదుపరి చిత్రంకోసం అందరు చెప్పే కధలు చాలా శ్రద్దగా వింటున్నాడట.

పూర్తిగా తనకు కధ నచ్చితే కానీ సినిమాను ఒప్పుకోను అని అంటున్నాడట. ఇప్పటికే చాలా కధలు విన్నా తనకు ఏ కధా నచ్చలేదు అంటున్నాడట. కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడూ అంటే చెప్పలేని అయోమయంలో మన మాస్ మహారాజా ప్రస్తుతం ఉన్నాడని టాలీవుడ్ టాక్....

మరింత సమాచారం తెలుసుకోండి: