ఇక తెలుగు సినిమాల‌కి రాం రాం అంటోంది స‌మంత‌. పిలిచి మ‌రీ స్టార్ క‌థానాయిక హోదా క‌ట్టబ‌డితే ఈ త‌మిళ్ పోరి ఇలా మాట్లాడుతుందేంటి అని తెలుగు సినిమా జ‌నాలు ఇప్పుడు ముక్కున వేలేసుకొంటున్నారు. కోటి రూపాయ‌లిచ్చి అడిగిన వ‌సతుల‌న్నీ స‌మ‌కూర్చినా నాకు త‌మిళ ప‌రిశ్రమే ముద్దన‌డానికి కార‌ణ‌మేమిటి? అని ఆరాతీస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

స‌మంత తెలుగు సినిమాలు త‌గ్గిస్తాన‌ని చెప్పడానికి కార‌ణం ప్రియుడు సిద్ధార్థ్ అట‌. మ‌నోడికి ఇటీవ‌ల తెలుగులో స‌రైన విజ‌యం లేదు. మంచి సినిమాల్లో న‌టించినా తొక్కేస్తున్నార‌నేది సిద్ధార్థ్ వాద‌న‌. అందుకే ఇటీవ‌ల త‌మిళ‌నాడు వెళ్లి తెలుగు ప్రేక్షకుల‌కు టేస్ట్ లేద‌ని వాగేశాడు. అది తెలిసిన‌ప్పట్నుంచి తెలుగు సినిమా జ‌నాలు గుర్రున వున్నారు. సిద్ధార్థ్ అన్నిటికీ తెగించే అలా మాట్లాడ‌ట‌. ఇక‌పై అత‌డికి తెలుగులో సినిమాలు చేసే ఆలోచ‌న‌లేవీ లేవ‌ట‌. త‌మిళంలోనే సెటిల్ అవుదామ‌ని భావిస్తున్నాడ‌ట‌. అందుకే సిద్దార్థ్ అలా మాట్లాడేశాడ‌ట‌. త‌న ప్రియురాలైన స‌మంత‌ని కూడా పూర్తిస్థాయిలో త‌మిళ్‌కి షిఫ్ట్ అయ్యేలా చూస్తున్నాడ‌ట‌. 

సిద్దార్థ్ మాట‌లు వినే స‌మంత అలా నిర్ణయించుకొంద‌ట‌. ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లే త‌మిళంలో సూర్య స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ‌చ్చే నెల‌లోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ యేడాది చివ‌రిలోపు తెలుగు సినిమాల‌న్నీ పూర్తి చేసుకొని వెళ్లి పోదామ‌ని స‌మంత నిర్ణయం తీసుకొంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: