బోల్ బ‌చ్చన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంక‌టేష్‌, రామ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. అంజ‌లి, సాజ‌న్ ప‌ద‌మ్‌సీ క‌థానాయిక‌లు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జ‌రుగుతోంది. రామ్‌, సాజ‌న్‌ల‌పై అక్కడ ఓ గీతాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దీనికి ఇంకా పేరు ఖ‌రారు చేయ‌లేదు. అయితే నాలుగైదు పేర్లను ప‌రిశీలించారు. చివ‌రికి వాటిలో గోల్‌మాల్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేయ‌మ‌ని చిత్రబృందానికి చెప్పాడ‌ట‌. 

కె.విజ‌య‌భాస్కర్ ద‌ర్శక‌త్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాకి ముందుగా గ‌ర‌మ్ మ‌సాలా అనే పేరు అనుకొన్నారు. అది మ‌రీ ఘాటుగా ఉంద‌ని చెప్పి గోల్‌మాల్ ఫిక్స్ చేశారు. అది కూడా అంత బాగా లేద‌ని మ‌ళ్లీ బ్లాక్ బ‌స్టర్ అనేశారు. ఆ త‌రా్వ‌త రామ్‌బ‌ల‌రామ్ అనుకొన్నారు. ఇలా ఏదీ న‌చ్చక‌పోవ‌డంతో మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చి గోల్‌మాల్‌ని ఫిక్స్ చేశార‌ట‌. అది కూడా వెంక‌టేష్ స‌ల‌హా మేర‌కే టైటిల్‌ని నిర్ణయించార‌ట‌.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్తయింది. ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తార‌ని తెలుస్తోంది. బాద్‌షా, ఒంగోలుగిత్త... ఇలా ఇద్దరూ ప‌రాజ‌యాల‌బాట‌లో ఉన్నారు. విజ‌యం సాధించాల‌న్న క‌సితో ఉన్నారు. మ‌రి ఫ‌లితం ఎలా వ‌స్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: