త‌మిళ చిత్రసీమకి ఓ గాయ‌నిగా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత సెల్వరాఘ‌వ‌న్ పుణ్యాన క‌థానాయిక అయింది. యుగానికి ఒక్కడు అనే సినిమాలో కార్తితో క‌లిసి ఆడ‌పాడింది. ఆ త‌ర్వాత అమ్మడికి వ‌ర‌స‌గా న‌టించే అవ‌కాశాలు వ‌చ్చాయి. ఎవ‌రి గురించి చెబుతున్నానో ఈ పాటికే అర్థమై ఉంటుందేమో.... పొడుగుకాళ్ల సుంద‌రి ఆండ్రియా గురించే. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమాలోన‌టిస్తోంది. అక్కడ మాత్రం హీరోయిన్గా కాదండోయ్‌. ఓ జోక‌ర్‌గా. అవును మ‌రీ... మిసెస్ జోక‌ర్ అనే పాత్రలో అమ్మడు వినోదం పంచ‌బోతోంద‌ట‌. మొహానికి రంగులు కూడా అచ్చం జోక‌ర్‌లాగే వేసుకొని తెర‌పై క‌నిపిస్తుంద‌ట‌.

ఈ ముద్దుగుమ్మ అన‌తి కాలంలోనే బోలెడంత పేరు సంపాదించుకొంది. పాట‌లు పాడుతూ, సినిమాల్లో న‌టిస్తూ అమ్మడు ఎంత‌గా పేరు తెచ్చుకొందో క‌థానాయ‌కులు, సాంకేతిక నిపుణుల‌తో ప్రేమాయ‌ణాలు సాగిస్తూ అదే స్తాయిలో ప్రాచుర్యం పొందింది. కొల‌వెరి కుర్రాడు అనిరుధ్‌కి లిప్ టు లిప్‌కిస్‌లు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.

ఇటీవ‌ల క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌ల‌సి విశ్వరూపం చేసింది. ఆ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా విడుదలైంది. దానిద్వారా హాలీవుడ్ చిత్ర ప‌రిశ్రమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ బ్యాట్‌మేన్ సిరీస్ సినిమాలో న‌టిస్తోంది. చేసేది చిన్న పాత్ర అయినా... హాలీవుడ్ స్థాయిలో పేరు తెచ్చుకొంటున్నా కదా అని అమ్మడు తెగ సంతోష‌ప‌డుతోంది. మ‌నం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదామా మ‌రి...

మరింత సమాచారం తెలుసుకోండి: