చాలా కాలం తర్వాత యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌కు గరుడవేగ రూపంలో సక్సెస్‌ దక్కింది. ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంకు మాస్‌ మరియు క్లాస్‌ ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ దర్కింది. మొదటి వారం రోజుల్లో గరుడవేగ దాదాపుగా 15 కోట్లు వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతుంది. గరుడవేగకు ఇతర సినిమాల నుండి పోటీ లేక పోవడంతో పాటు, ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో కలెక్షన్స్‌ భారీగా వస్తున్నాయి. 


వారం రోజుల పాటు మంచి కలెక్షన్స్‌ రాబట్టిన గరుడవేగకు ఇక బ్రేక్‌ తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో ఏ ఒక్కటి లేదా రెండు సినిమాలు సక్సెస్‌ టాక్‌ దక్కించుకున్నా కూడా గరుడవేగ కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యే అవకాశం ఉంది. కేరాఫ్‌ సూర్య మరియు ఒక్కడు మిగిలాడు చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. 


ఇక అదిరింది చిత్రంపై మాస్‌ ఆడియన్స్‌ దృష్టి ఉంది. ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల అభిమానంను దక్కించుకోలేక పోతే అప్పుడు గరుడవేగ మరో వారం రోజుల పాటు తన కలెక్షన్స్‌ను కొనసాగించే అవకాశం ఉంది. లేదంటే మొదటి వారంలో వచ్చిన కలెక్షన్స్‌తోనే సరిపెట్టుకోవాల్సిందే అంటూ ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు.


అయితే సినిమా టాక్ బాగున్నా కలక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు కష్టమే అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సినిమా మాత్రం రాజశేఖర్ కు మళ్ళీ మంచి మైలేజ్ తెచ్చి పెట్టింది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: