అంతర్జాతీయంగా లైంగిక వేధింపుల కి సంబంధించి మహిళలు అందరూ ఒక్కొక్కరు గా బయట పడుతున్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా ఉండకు అంటూ ప్రతీ ఆడ మనిషీ మొదలు పెట్టిన ఈ మీ టూ అనే క్యాంపెయిన్ లో సోషల్ మీడియా మాధ్యమం గా నడుస్తున్న ఈ అద్భుత పంథా అనేక షాకింగ్ విషయాలని బయట పెడుతోంది.

నిందితులు ఒక్కొక్కరు గా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. అంతర్జాతీయ మోడల్స్ ఇప్పుడు తమని ఎవరో కాదు ఫోటోగ్రాఫర్ లే లైంగికంగా వేధించారు అంటూ చెప్పి షాకింగ్ వార్త విడుదల చేసారు. ఒంటారియో ప్రముఖ మోడల్, అందాల సుందరి డ్రూ క్యాథరిన్ తన కెరీర్ లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి పెదవి విప్పింది.

తాను మోడలింగ్ చేసే సమయంలో ఫొటోగ్రాఫర్లు తనను లైంగికంగా వేధించారని ఆమె తెలిపింది. కేవలం తననే కాదని, చాలా మంది మోడల్స్ లైంగిక వేధింపులబారిన పడ్డారని ఆమె వెల్లడించింది. 

ఫోటో షూట్ లకి వెళ్ళిన టైం లో అనేక రకాలు గా ఫోటో గ్రాఫర్ లు తమని ఇబ్బంది పెడతారు అనీ సెక్స్ కావాలి అంటూ ఓపెన్ గా అడుగుతారు అంది ఆమె. ఫోటోలు హాట్ గా అద్భుతంగా రావాలి అంటే వారితో పడుకోవాల్సిందే అని ఆమె కుండ బద్దలు కొట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: