డిసెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కి సిద్దం అవుతున్న పద్మావతి చిత్రం మీద స్టే కోసం సుప్రీం లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాము సినిమాని స్టే చేసే పరిస్థితి లేదు అంటూ సుప్రీం ధర్మాసనం తమ నిరాకరణ తెలిపింది.

ఏదైనా సినిమా విడుదలకు ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్సీ) అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. దీంతో ‘పద్మావతి’ సినిమా విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది.

ఈ సినిమా మీద విడుదల ఆపేంత స్టే వెయ్యడానికి కారణం "రాజ్ పుత్" ల మనోభావాలు దెబ్బ తీసే సీన్ లు ఉన్నాయి అనీ చరిత్ర కి పూర్తి విరుద్ధంగా ఈ సినిమా నడుస్తుంది అనీ కొందరు భావించడమే.

సిద్ధరాజ్‌ సిన్హ్‌తో పాటు 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంకే ఖాన్‌ విల్కర్‌, డీవై చంద్రచూడ్‌ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.  సెన్సార్ బోర్డు అన్నీ చూసి అన్నీ పరిశీలించిన తరువాతనే సినిమాలు విడుదల చేస్తుంది కనుక బోర్డు తో తేల్చుకోవాలి అని కోర్టు తీర్పు చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: