ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సుమన్, కృష్ణం రాజు, మాలాశ్రీ, జయసుధ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బావ బావమరిది’. ఈ చిత్రంలో బావలు సయ్యా.. హే మరదలు సయ్యా అనే పాట ఇప్పటికి అందరి నోళ్ళలో నానుతూనే ఉంటుంది. సిల్క్ స్మిత, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ల మధ్య సాగిన ఈ ఐటెం సాంగ్ అప్పట్లో ఉర్రూతలూగించింది. 

స్వతహాగా మలయాళీ అయినా రాధిక తెలుగులో కూడా అనేక పాటలు పాడారు. అవి ఎంతగానో జనాదరణ పొందాయి.  తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాధిక తుదిశ్వాస వదిలారు. గుండెపోటుతో నిన్న ఉదయం చెన్నైలోని పాలవాక్కంలో ఆమె మృతి చెందారు. నరసింహ నాయుడు చిత్రంలోని “చిలక పచ్చ కోక పెట్టినాది కేక”, అన్నయ్య చిత్రంలోని “ఆట కావాలా పాట కావాలా” వంటి అనేక పాటలను రాధిక పాడారు. 
Image result for గాయని రాధిక మృతి
ఆమె మరణ వార్త ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ని షాక్ కి గురి చేసింది.  నేడు చెన్నైలో రాధిక అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆమె భర్త శివకుమార్ తెలిపారు. ఆమె మృతి పట్ల సంగీత దర్శకులు కోటి, మణిశర్మ గాయకులు మనో సంతాపం తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: