ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా బెల్లంకొండ సురేష్ ఓ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు  సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శక‌త్వం వ‌హించ‌బోతున్నాడు స‌మంత క‌థానాయిక‌.   ఈ సినిమాకి 'ర‌భ‌స' అనే పేరు ప్రారంభం నుంచి  ప్రచారంలో వచ్చింది. అతి త్వరలో  సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి పేరు మారుస్తారని ప్రచారం టాలీవుడ్ లో జరుగుతోంది.

దీనికి ప్రధాన కారణం మన బుడ్డోడుకి   'ర‌భ‌స' అనేటైటిల్  న‌చ్చ లేద‌ట‌, అందువల్ల  వేరే ఏదైనా టైటిల్ ఆలోచించమని  చెబుతున్నాడ‌ట‌ . అయితే ద‌ర్శకుడు మాత్రం క‌థ‌కు త‌గ్గట్టుగా టైటిల్ బాగుంటుందని అన్నాడట . మ‌రి సినిమా సెట్స్‌పైకి వెళ్లేలోపే పేరు మారుస్తారా  లేదా అన్నది సందేహమే.

ఇంతకీ ఎన్టీఆర్ కు ‘రభస’ అన్న మాట వింటే అతడికీ బాలకృష్ణకీ మధ్య ఆ మధ్య జరిగిన రాజకీయ రభస గుర్తుకు వస్తోంది కాబోలు...

మరింత సమాచారం తెలుసుకోండి: