పూరి జ‌గ‌న్నాద్, నితిన్ కాంబినేష‌న్ లో రూపొంద‌బోతున్న సినిమా హార్ట్ ఎటాక్. ఈ మ‌ద్య బిగ్ హిట్ లేని పూరిజ‌గ‌న్నాద్ ఈ సినిమాతో ఎలాగైన సూప‌ర్ హిట్ కొట్టాల‌నుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాకు సంబంధించి  ప్రతి విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. ఆ ప్రాసెస్ లో బాగంగానే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలా రోజులుగా వేట మొద‌లెట్టాడు. కొత్త అమ్మాయి అయితే బాగుంటుంద‌ని చాలామంది మోడ‌ల్స్ ని కూడా ప‌రిశీలించాడ‌ట‌.
��
కానీ ఎందుకో వారెవ‌రు పూరి హార్ట్ కి ట‌చ్ అవ్వలేద‌ట‌. దీంతో హార్ట్ ఎటాక్ తెప్పింగల బ్యూటీ కోసం పూరి సెర్చ్ చేసి చేసి చివ‌రికీ త‌న లాస్ట్ సినిమా ఇద్దర‌మ్మాయిల్లో ఒక‌రైన  కేధ‌రిన్ నే హీరోయిన్ గా ఫైన‌ల్ చేశాడ‌ట‌. ఇద్దర‌మ్మాయిల‌తో సినిమాలో  త‌న అందంతో మాయ చేసిన  కేధ‌రిన్  హైట్ కి హైట్, అందానికి అందం వుంటంతో నితిన్ కి క‌రెక్ట్ పెయిర్ అని పూరి ఫీల‌వుతున్నాడ‌ట‌. అయితే కేధ‌రిన్ ని  హీరోయిన్ గా  ఎంపిక చేయ‌డం వెనుక  పూరి హార్ట్ కి ట‌చ్ అయిన మ‌రో క‌ధ వుంద‌ని కొద్దిమంది  గుస‌గుస‌లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: