రాష్ట్రం విడిపోక ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నంది అవార్డులను పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. రాష్ట్రం విడిపోక ముందు రాజకీయాల వల్ల నంది అవార్డులు అపహాస్యం అయ్యాయి. నంది అవార్డుల ఎంపిక విషయంలో విమర్శలు రావడం, నంది అవార్డులు వరుసగా సంవత్సరం సంవత్సరం ఇవ్వక పోవడం చేసేవారు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత నంది అవార్డులకు మరింత కష్టం వచ్చింది. నంది అవార్డులను ఏ రాష్ట్రం ఇవ్వాలనే చర్చ మొదట జరిగింది. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను తాము ఇస్తాము అంటూ ముందుకు వచ్చింది. ఎప్పటి నుండి అయితే నంది అవార్డులను ఇవ్వడం లేదో అప్పటి నుండి నంది అవార్డులను ప్రకటించేందుకు సిద్దం అయ్యారు. 


గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం అవార్డులను ప్రకటించారు. తాజాగా మూడు సంవత్సరాలకు గాను అవార్డులను ప్రకటించారు. మొత్తంగా అయిదు సంవత్సరాల అవార్డులు ఇవ్వాల్సి ఉంది. నంది అవార్డులను ప్రకటించడం అయితే జరిగింది. కాని నంది అవార్డుల ప్రధానం మాత్రం జరగడం లేదు. ప్రభుత్వంకు నంది అవార్డుల ప్రధానం అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. అయినా కూడా నంది అవార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వాలు ఆసక్తి కనబరచడం లేదు.


ప్రభుత్వ పెద్దలకు ఆసక్తి లేకపోవడంతో పాటు, సినీ వర్గాల వారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాకపోవడం వల్లే నంది అవార్డులకు ఈ గతి పట్టింది అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ అవార్డు స్థాయిలో నంది అవార్డులను ఇవ్వాలని తెలుగు సినిమా ప్రముఖులు కోరుకుంటున్నారు. కాని అది మాత్రం సాధ్యం కావడం లేదు. అయితే ఈసారి మాత్రం ఏపి ప్రభుత్వం ప్రకటించడమే కాదు జనవరి చివరి వారంలో ఈ అవార్డుల వేడుకను జరుపాలని నిర్ణయించుకుంది. కొత్త సంవత్సరంలో నంది అవార్డుల పండుగ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: