సినీ రంగంలో అత్యుత్త‌మ‌ ప్రతిభ కనబరిచిన వారికి నంది అవార్డులను ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది.  2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 
2014,2015,2016 నంది అవార్డులు ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం
అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి పుర‌స్కారం, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారంను జ్యూరీ ప్రకటించింది. ఇందులో ఛైర్మ‌న్‌గా ఉన్న సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ మాట్లాడుతూ వివ‌రాలు తెలిపారు.

ఉత్తమ చిత్రాలుగా 2014లో ‘లెజెండ్’, 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’, 2016లో ‘పెళ్లి చూపులు’ నిలిచాయి. నటుడు గిరిబాబు, నిర్మాత పోకూరి బాబురావు, జీవిత రాజశేఖర్ అధ్యక్షతన మూడు కమిటీల సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌లో సినిమాలను చూశారు. కాగా అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో బాలయ్య, మురళీ మోహన్ అధ్యక్షతన ఈ అవార్డ్స్‌ను ప్రకటించారు.

Image result for నంది అవార్డులు

2014 సినిమా అవార్డులు:
ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- క‌మ‌ల‌హాస‌న్‌
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు
గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌కి స్పెషల్ జ్యూరీ అవార్డు


2015 అవార్డులు:
 
ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా అవార్డు- కీర‌వాణి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌
స్పెషల్ జ్యూరీ అవార్డు - పీసీ రెడ్డి


2016 అవార్డులు:
ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ర‌జ‌నీకాంత్‌
బీఎన్ రెడ్డి పుర‌స్కారం- బోయ‌పాటి శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా అవార్డు- కేఎస్ రామారావు
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- చిరంజీవి
స్పెషల్ జ్యూరీ అవార్డు - ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌


మరింత సమాచారం తెలుసుకోండి: