ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా కొద్ది రాజకీయ వ్యూహాలకు పార్టీలన్ని సిద్ధమవుతున్నాయి. తెలంగాణాలో పరిస్థితి ఎలా ఉన్నా ఏపిలో మళ్లీ టిడిపి గెలిచేందుకు అన్నివిధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. లాస్ట్ టైం పవన్ వచ్చి సపోర్ట్ ఇచ్చాడు.. బిజెపి పొత్తు అన్ని కలిసొచ్చాయి. అయితే ఈసారి పవన్ జనసేన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చేసింది. ఏపి, తెలంగాణాలో జనసేన అభ్యర్ధులు కూడా ఈసారి పోటీలో నిలబడతారని తెలుస్తుంది.  


పరోక్షంగా సపోర్ట్ ఇవ్వాలనుకున్నా మునుపటిలా ఉండదు. అందుకే మళ్లీ ఈసారి జూనియర్ ను రంగంలో దించేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారట టిడిపి నేతలు. ఇప్పటికే ఆ విధంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అందులో భాగంగానే టిడిపి ప్రభుత్వం తరపున ఎన్.టి.ఆర్ నంది అవార్డ్ అందుకున్నాడు. జనవరి చివరి వారంలో జరిగే ఈ అవార్డుల ప్రధానోత్సవంలో బాలకృష్ణతో ఎన్.టి.ఆర్ కనిపిస్తాడని టాక్.


నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న ఈ కలయిక ఇంకా కొద్దిరోజుల్లో నెరవేరుతుందని తెలుస్తుంది. అయితే 2009లో ఎన్.టి.ఆర్ వచ్చి ప్రచారం చేసినా గెలవలేదు.. అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పుడు ఎన్.టి.ఆర్ ప్రచారంలోకి వస్తాడా అసలు.. అందుకు సై అంటాడా అన్నది తెలియాల్సి ఉంది. 


బాలయ్య మాత్రం జూనియర్ ను దూరం పెట్టేశాడు. కళ్యాణ్ రామ్ సంధి కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు. మరి ఈ నంది అవార్డుల వల్లైనా ఫ్యాన్స్ కోరుకునే బాబాయ్ అబ్బాయ్ మీటింగ్ ఉంటుందో లేదో చూడాలి. ఇక ఎలాగు మాటలు కలిశాయి కాబట్టి ఇక పార్టీకి.. ఎన్నికలకు సంబందించిన విషయాల్లో కూడా ఎన్.టి.ఆర్ ను ఇన్వాల్వ్ చేస్తారని అంటున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: